నటి సాయిపల్లవిపై సీనియర్ దర్శకుడి అభిమానం

యువ నటి సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం అమ్మడు తమిళంలో జోరు పెంచింది. 

కాగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం నటి సాయిపల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాయిపల్లవి నటనకు తాను పెద్ద ఫ్యాన్ ను అని చెప్పారు. ప్రతిభావంతురాలైన నటిగా ఆమెను చాలా ఇష్టపడతానని తెలిపారు. ఏదో ఒకనాడు తప్పకుండా ఆమెతో సినిమా తీస్తానని మణిరత్నం వెల్లడించారు. 

శివకార్తికేయన్ సరసన సాయిపల్లవి నటించిన కొత్త చిత్రం 'అమరన్'. ఈ సినిమా దీపావళి వేళ అక్టోబరు 31న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే సాయిపల్లవి గురించి మణిరత్నం స్పందించారు.

Sai Pallavi
Mani Ratnam
Fan
Amaran
Pre Release Event

More Telugu News